పరుగుల రేడు గుండె ఆగింది!
భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాసవిడిచారు.ఆక్సిజన్ స్థాయిలు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం వల్ల మిల్కాను జూన్ 3న చంఢీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల ముందే మిల్కా సతీమణి నిర్మల్ కౌర్ కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా మిల్కా మరణం గురించి ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. “ఆయన ఎంతో పోరాడారు. కానీ దేవుడు తన…