ప్రముఖ తమిళ కమేడియన్ కన్నుమూత!

తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న వివేక్‌.. దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ ‘మనదిల్‌ ఉరుది వేండం’ చిత్రం ద్వారా ఆయన సినీరంగ ప్రవేశం చేశారు.  ఆ తర్వాత ఆయన తన నటనతో తమిళ్ తో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. వివేక్ మృతితో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి ఇండస్ట్రీకి లోటని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.