×
In

ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముంబైలోని వాంఖడే వేదికగా పంజాబ్ తో జరిగిన పోరులో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ (13/4) అద్భుత ప్రదర్శనతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పంజాబ్‌ జత్తును షారుక్ ఖాన్‌(47; 36 బంతుల్లో 4×4, 2×6) ఆదుకున్నాడు. ఓపెనర్లు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(5), మయాంక్‌ అగర్వాల్‌(0)తో పాటు క్రిస్‌గేల్‌(10), దీపక్‌ హుడా(10), నికోలస్‌ పూరన్‌(0) టాప్‌ ఆర్డర్‌ చహార్ దెబ్బకు కుప్పకూలింది. ఓ దశలో ఆ జట్టు వంద పరుగులు కూడా దాటుతుందా అనిపించింది. షారుఖ్ ఖాన్ పోరాట పటిమతో ఆ స్కోరైనా చేయగలిగింది. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ , డ్వెన్ బ్రేవో , మెయిన్ అలీ, తలా ఒక వికెట్ పడగొట్టారు. పంజాబ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చెన్నై జట్టు 15.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(5) మరోసారి నిరాశపర్చినా.. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌(36*; 33 బంతుల్లో 3×4, 1×6)తో పాటు, అల్ రౌండర్ మెయిన్అలీ(46; 31 బంతుల్లో 7×4, 1×6) కలిసి జట్టును విజయ పథంలో నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. పంజాబ్‌ బౌలర్లలో షమి రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌, అశ్విన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all

Telangana: రణమా… శరణమా?… గులాబీ పార్టీలో అంతర్మథనం..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే మరోవైపు...

Read out all

cinima: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..?

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల విడుదలపై  చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’ సినిమాల విడుదలపై...

Read out all

cinima: ₹300 కోట్ల క్లబ్‌లో తండ్రీకొడుకులు.. చిరంజీవి-చరణ్ అరుదైన రికార్డు..!!

Tollywood: భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్, వారసత్వం, బాక్సాఫీస్ ప్రభావం గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు ఒకే ఏడాదిలో విడివిడిగా ₹300 కోట్లకు పైగా...

Read out all
Optimized by Optimole