‘మహాసముద్రం’ ఫస్ట్ లుక్ విడుదల!

లవర్ బాయ్ ఇమేజ్తో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్. దాదాపు ఏడేళ్ల తర్వాత అతను తెలుగులో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఆర్ ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. తాజాగా చిత్ర యూనిట్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. పోస్టర్లో సిద్దార్ద్ కొత్త లుక్లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌తో పాటు మరో ప్రధాన పాత్రలో శర్వానంద్ నటిస్తున్నాడు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగష్టు 19న గ్రాండ్‌గా విడుదల కానుంది.