టి-20 వరల్డ్ కప్ వేదికలు ఖరారు!

స్వదేశంలో జరగబోయే టీ-20 వరల్డ్ కప్ వేదికలను బీసీసీఐ శనివారం ఖరారు చేసింది. ఫైనల్ తో సహా మిగతా మ్యాచ్ లను 8 వేదికల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌క‌తా, బెంగుళూరు, హైద‌రాబాద్, ధ‌ర్మ‌శాల న‌గ‌రాల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా అధికారికంగా ప్రకటించాడు. ఫైన‌ల్ మ్యాచ్‌ను అహ్మ‌దాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం(మోతెర)లో నిర్వ‌హించ‌నున్నారు. కాగా ప్రపంచకప్లో పాల్గొనబోయే పాక్ ఆటగాళ్ల వీసా విషయంలోను స్పష్టత వచ్చినట్లు షా పేర్కొన్నారు.