ముంబై మరో విక్టరీ!

ఐపీఎల్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ విజయాల పరంపర కొనసాగుతుంది. తాజాగా శనివారం హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన పోరులో 13 పరుగులు తేడాతో గెలిచి మరోసారి సత్తా చాటింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(40; 39 బంతుల్లో 5×4), రోహిత్‌ శర్మ(32; 25 బంతుల్లో 2×2, 2×6) పొలార్డ్‌(35*; 22 బంతుల్లో 1×4, 3×6) రాణించడంతో 150 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, విజయ్‌ శంకర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్ పడగొట్టాడు. ఛేదనలో సన్ రైజర్స్ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(43; 22 బంతుల్లో 3×4, 4×6), డేవిడ్‌ వార్నర్‌(36; 34 బంతుల్లో 2×4, 2×6) రాణించినా..మిగతా బ్యాట్సమెన్స్ వరుసగా పెవిలియన్‌ క్యూ కట్టారు. మధ్యలో విజయ్‌ శంకర్‌(28; 25 బంతుల్లో 2×6) పోరాడినా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. ముంబయి బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. బౌల్ట్‌, చాహర్‌ మూడేసి వికెట్లు తీయగా.. బుమ్రా, కృనాల్‌ పాండ్య చెరో వికెట్‌ పడగొట్టారు.