ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ!
ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ… పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో “విపులా ! నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెళుతున్నాను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి”…