Apnews: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పై ప్రజాభిప్రాయం: పీపుల్స్ పల్స్
Peoplespulse: రాష్ట్ర ఖజానాపై తక్కువ భారంతోనే ఆంధ్రప్రదేశ్ లోని 70 శాతం పైగా కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం-2) పథకాన్ని చిన్న చిన్న మార్పులతో మరింత ప్రభావవంతగా అమలు జరుపవచ్చు. ఇప్పుడున్న పద్దతిలోనే నడిపిస్తే… లబ్దిదారులు సంతృప్తి చెందక పోగా పథకం ప్రజాదరణ కోల్పోయి, రాజకీయ లబ్ది కూడా మిగలని ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. ప్రజాభిప్రాయం ప్రకారం, ‘జీరో బిల్లింగ్’పద్దతిలో ఉచిత సిలిండర్ అందించడమనే చిన్న సాంకేతిక మార్పు ద్వారా…