Elections2025: మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీలు తప్పనిసరి.. డీలిమిటేషన్ షెడ్యూల్ విడుదల..!
హైదరాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, అలాగే మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ)కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త డైరెక్టర్ సృజన ఒక అధికారిక సర్క్యులర్‌ను జారీ చేశారు. ప్రముఖ మార్గదర్శకాల ప్రకారం, అవసరమైతే ఎంపీటీసీలను కొత్తగా ఏర్పాటు చేయడం లేదా సమీప ఎంపీటీసీలలో విలీనం చేయడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను డైరెక్టర్ ఆదేశించారు. తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ)…