తాత్కాలిక సిబ్బందిని నియమించండి : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పోరు మొదటి శ్రేణి యోధులైన వైద్య ఆరోగ్య సిబ్బంది పై ఒత్తిడి తగ్గించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా ఈ రెండు మూడు నెలల కోసం, వైద్యుల, 50 వేల తాత్కాలిక సిబ్బందిని నియమించాలని వైద్య శాఖ కు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులుపై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత, రెసిడెమివర్ ఇంజక్షన్స్, పడకలు…