తాత్కాలిక సిబ్బందిని నియమించండి : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పోరు మొదటి శ్రేణి యోధులైన వైద్య ఆరోగ్య సిబ్బంది పై ఒత్తిడి తగ్గించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా ఈ రెండు మూడు నెలల కోసం, వైద్యుల, 50 వేల తాత్కాలిక సిబ్బందిని నియమించాలని వైద్య శాఖ కు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులుపై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత, రెసిడెమివర్ ఇంజక్షన్స్, పడకలు వంటి విషయాలను గురించి కేసీఆర్, వైద్య అధికారులతో చర్చించారు. అంతేకాక పరిస్థితులు దృష్ట్యా వైద్య శాఖలో 50 వేల తాత్కాలిక నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల కోసం సేవ చేయడానికి యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


5 కేజీల బియ్యం ఉచితం :
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి ప్రభుత్వం తరపున రెండు నెలల పాటు 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వీరితో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులకు, సిబ్బందికి 2000 రూపాయలతో పాటు 25 కిలోల బియ్యం అందజేయాలని సీఎం కేసీఆర్ అదేశలు జారీచేశారు.