కేసిఆర్ బలం,బలహీనత తెలుసు..నల్లగొండ.. ఖమ్మం గడ్డపై బీజేపీ జెండా: ఈటల
బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ అధికార టీఆర్ఎస్ లో అలజడి రేపుతోంది.నల్లగొండ, ఖమ్మం జిల్లాల గడ్డపై కాషాయ జెండా ఎగరబోతుందని ఈటల ధీమాగా కామెంట్స్ చేశారు.ఇటీవల రెండు జిల్లాలోని అధికార పార్టీ, కాంగ్రెస్ నేతలు కారు దిగనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈటల చేసిన వ్యాఖ్యలతో.. ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది. అంతేకాక సీఎం కేసిఆర్ తో కలిసి 20 ఏళ్లు అడుగులో అడుగు వేసిన వాడినని.. ఆయన బలం బలహీనత తెలిసిన వాడినని…