Telangana: అభాండాలు…. అసత్యాలే ప్రతిపక్షాల నైజం..!
INCTelangana: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ======================= అసత్యాలను పదేపదే వల్లెవేస్తే అవే వాస్తవాలవుతాయనే భ్రమల్లో ప్రతిపక్షాలున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే అభద్రతాభావంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ నిరాధార అవాస్తవ ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇచ్చిన హామీలను ఒక్కొక్కొటీ నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను…