జనసేన ప్రభుత్వంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం : నాదెండ్ల మనోహర్
పాలకుల్లో స్పందించే మనస్తత్వం లేనప్పుడు ఎన్ని సీట్లు తెచ్చుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రభుత్వాలు కొత్తగా వ్యాపారాలు.. ఉపాధి అవకాశాలు సృష్టించకపోయినా ఉన్నవాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు, సంక్షేమ పథకాల విషయంలో చేతి వృత్తులను కులాల వారీగా విడగొట్టి పేదలకు లబ్ధి పొందకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. హస్త కళాకారుల జీవితాలకు భరోసా లేకుండా చేసింది వైసీపీ పాలకులేని మనోహర్…