దళిత ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారు: గౌతమ్
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్. ఎస్సీ, ఎస్టీ,సంక్షేమ అభివృద్ధి పథకాలను ‘దుర్వినియోగమైనవి’గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసినట్టు వైకాపా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలో వైకాపాకు ఓటు వేసి అధికారంలోకి తీసుకువస్తే..సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైసీపీ వైఖరి ఎస్సీ ఎస్టీ లను అవమానించే…