×

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్. ఎస్సీ, ఎస్టీ,సంక్షేమ అభివృద్ధి పథకాలను ‘దుర్వినియోగమైనవి’గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసినట్టు వైకాపా ప్రభుత్వం అంగీకరించిందన్నారు.  రాష్ట్రంలో  వైకాపాకు ఓటు వేసి అధికారంలోకి తీసుకువస్తే..సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైసీపీ వైఖరి ఎస్సీ ఎస్టీ లను అవమానించే విధంగా ఉన్నట్లు గౌతమ్ పేర్కొన్నారు.

ఇక  గత 75 ఏళ్ల లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎస్సీ ఎస్టీల  సాధికారతకు ఎన్నో రకాల చట్టాలను పథకాలను తీసుకువచ్చాయన్నారు గౌతమ్. ఈ వర్గాల పురోబివృద్దికి కాంగ్రెస్ దోహదం చేస్తే..జగన్ ప్రభుత్వం వీటిని రద్దు చేసి దళిత ద్రోహి గా మిగులుతారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. దివంగత ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ శంకరన్ లాంటి ఎంతోమంది  అధికారులు, ప్రజా మేధావులు, ప్రజా పాలకులు కలిసి రూపొందించిన పథకాలను కమిషన్ల పథకాలుగా వైకాపా ప్రభుత్వం పేర్కొనడం వారి అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియజేస్తున్నదని గౌతమ్ దుయ్యబట్టారు.

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all

HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా...

Read out all

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ...

Read out all

ap: ప్రమాదంలో గ్రామ సచివలయాలు: పీపుల్స్ పల్స్

Appolitics: పారదర్శక ప్రజా విధాన విశ్లేషణకు అంకితమైన పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి సర్వే ఫలితాలను ఈరోజు విడుదల చేసింది....

Read out all

sankranti: సంక్రాంతి…సంస్కృతి… స్త్రీ..!!

మాలతి పల్లా: పిండి వంటలు చేసి, ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి, పట్టు చీరలు కట్టుకొని ఇంటి సంస్కృతిని ఒక స్త్రీ కాపాడుతుండాలి. స్టేజి మీద అర్ధ నగ్న నృత్యాలు చేసి...

Read out all
Optimized by Optimole