Tearfulltribute: ఎవరి ‘స్వర్గం’ వారే రచించుకోవాలి..!
ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): సాత్వికంగా ఉంటే… సామర్థ్యంతో నిమిత్తం లేకుండా ఒకోసారి గుర్తింపు రాదేమో! గుర్తింపులోనూ తేడాలు. ఎవరి గుర్తింపు? ఏ రకమైన గుర్తింపు? మళ్లీ ఇవి సాపేక్షంగా చూడాల్సినవే! అందుకని, ఒకరిని ఎవరి దృష్టి కోణంలో వారు చూసి, మంచి-చెడులు గణించడం, ఆ మేర పరిగణించడమే సమంజసమేమో! జన్నత్ హుస్సేన్, ఐ.ఎ.ఎస్ అనే సీనియర్ ఆలిండియా సర్వీసెస్ అధికారి… మౌలికంగా సద్యోచన (positive thinking) గల మంచివాడు. సాత్వికుడు. అందరితోనూ మంచిగా…