గ్రూపు- 4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహం..
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్1 తో పాటు ఆయా శాఖల్లో భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనేపథ్యంలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9 వేల 618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని అధికారులు సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు…