‘పంత్’ కెరీర్లో బెస్ట్ ర్యాంక్ !
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాకింగ్స్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ సత్తా చాటాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో(747 పాయింట్లతో)పంత్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని కెరీర్లో ఇది ఉత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇకపోతే భారత ఆటగాళ్ళలో కెప్టెన్ కోహ్లీ (814 పాయింట్లతో) ఐదో స్థానాన్ని నిలిచాడు. కాగా రిషబ్ పంత్ తో పాటు హెన్రీ నికోలస్, రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు….