Lordshiva: శివుడు మూడో కన్ను తెరిచినా సరే.. తప్పు తప్పే..!
విశీ(సాయివంశీ): పూర్వం మదురైని షణ్మగపాండియన్ అనే రాజు పాలిస్తున్నాడు. ఒకసారి ఉద్యానవనంలో ఉన్న సమయంలో తన భార్య జుట్టులోనుంచి సుగంధ పరిమళం ఆయన్ను తాకింది. కానీ ఆమె జుట్టుకు ఎటువంటి నూనె రాయలేదు. తలలో పూలు కూడా లేవు. దీంతో ‘స్త్రీ జుట్టులోనుంచి వచ్చే పరిమళం సహజమైనదా? వేరే కారణం వల్ల వస్తుందా’ అనే ప్రశ్న మొదలైంది. దీనికి సమాధానం చెప్తే వెయ్యి బంగారు నాణేలు ఇస్తానని ఆయన ప్రకటించాడు. ఇందుకోసం చాలామంది ప్రయత్నించినా ఎవరూ సరైన…