తీరుమారని నల్లగొండ బీజేపీ నేతలు.. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ ..
నల్లగొండ బీజేపీలో రెండు వర్గాల గ్రూపు తగాదా రచ్చకెక్కిందా? రెండు వర్గాల తీరుతో కార్యకర్తల్లో అయోమయం నెలకొందా? తెరపై కొత్త నేతలు ప్రోజెక్ట్ అవుతున్న నేపథ్యంలో సీనియర్ నాయకులు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారా? క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని అధినాయకత్వం పిలుపునిచ్చినా నేతలు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారా? అసలు నల్లగొండ కాషాయం పార్టీలో ఏంజరుగుతుంది? నల్లగొండ జిల్లా బీజేపీ నేతల తీరుపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు రెండు వర్గాలుగా విడిపోవడంతో పార్టీలో తీవ్ర…