MalathiChandur: తెలుగు వారి గూగులమ్మ “సాహితీ” మాలతీ..!
సాయివంశీ: మాలతీ చందూర్ గారి గురించి చెప్పాలని ఉంది. ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాల పుణ్యమా స్వాతి సపరివార పత్రిక అనగానే సమరం గారి ‘సుఖ సంసారం’ శీర్షిక టక్కున నెనపుకొచ్చేలా మారింది కానీ, నా దృష్టిలో ఆ రోజుకీ, ఈ రోజుకీ స్వాతి వాళ్లు వేసిన The Best Coloum అంటే మాలతీ చందూర్ గారి ‘నన్ను అడగండి’. 18 నవలలు, ‘చంపకం-చెదపురుగులు’ కథా సంపుటి, పాత కెరటాలు పేరిట నవలల పరిచయం, ‘ప్రమదావనం’ అనే…