నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై కమలం ఫోకస్..
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే మూడు విడతల యాత్రలు విజయవంతం కావడంతో.. నాలుగో విడత యాత్రకు భారీ ఎత్తులో ప్లాన్ సిద్ధం చేసేందుకు కమలం నేతలు సమయతమవుతున్నారు. పాదయాత్ర ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడ ముగించాలి అనే అంశాలపై సెప్టెంబర్ 2,3 తేదీల్లో జిహెచ్ఎంసి, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తుదినిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి….