వికారాబాద్ రాజకీయ వీరుడెవరు?
వికారాబాద్ లో సరికొత్త రాజకీయానికి నేతలు తెరలేపారు. అధికార బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే పనిపోయిదంటు సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తుంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఉద్యమకారులు మాపార్టీకి మేమే దిక్కంటూ దూసుకొస్తున్నారు. అటు కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లో ఎండగడుతూ దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సైతం రేసులో నేనున్నాంటూ తగ్గేదెలే తరహాలో ప్రచారంలో నిమగ్నమయ్యారు. బిఆర్ఎస్ లో అధిపత్య పోరు.. వికారాబాద్ బీఆర్‌ఎస్ లో అధిపత్య పోరు…