ఏది సాధ్యం? ఎవరికోసం?
ముస్లీంలు ఈ దేశంలో తరచూ చర్చనీయాంశమే! దాంతో వారికి జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ! వారే లక్ష్యంగా పార్టీలు వ్యూహ`ప్రతివ్యూహాలు పన్నుతుంటాయి. అది పార్టీల లాభనష్టాల వ్యవహారమే తప్ప ముస్లీంలకు ఒరిగేదేమీ ఉండదు. ముస్లీంలు ఇతర బలహీనవర్గాల సంరక్షణ కోసమే పనిచేస్తున్నట్టు చెప్పుకునే మజ్లీస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) వల్ల కూడా వారికి కలిగే ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ, అలా పడిన ముద్ర వల్ల మజ్లీస్ పార్టీ పొందే రాజకీయ ప్రయోజనమే ఎక్కువ!…