ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం హెచ్చరిక!
ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రవేట్ స్కూల్స్ కి జీవో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బోధనా రుసుము పెంచినట్లయితే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. జులై 1 నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై విద్యా శాఖ జీవో జారీ చేసింది. బోధన రుసుము మాత్రమే నెలవారీగా తీసుకోవాలని ఉత్తర్వుల్లో విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, అంతర్జాతీయ పాఠశాలలకూ జీవో వర్తిస్తుందని విద్యా శాఖ…