ఎస్ఈసీ మాటలు వింటే చర్యలు తప్పవు: మంత్రి రామచంద్రా రెడ్డి

ఎస్ఈసీ(ఎన్నికల కమిషనర్) మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే,బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్లు, పంచాయతీ ఎన్నికల అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేము ఎన్నికల కమిషనర్ మాట వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దిరెడ్డి అన్నారు.

కాగా చిత్తూరు, గుంటూరు లో ఏకగ్రీవాలు అపమని ఎన్నికల కమిషనర్ అంటున్నారు. అందుకు సహకరిస్తూ, తొత్తులుగా పనిచేసే అధికారుల అందరిని గుర్తుపెట్టుకుంటామని ఆయన అన్నారు. ఎస్ఈసీ ని అధికారులు గౌరవించాల్సిన పనిలేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వలన , వైసీపీ అభ్యర్థులు అత్యధికంగాఏకగ్రీవంగా స్థానాలు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.