ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ మెగాస్టార్..?

మెగాస్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. ప్రముఖ దర్శకుడు సుకుమారుడు శిష్యుడు బుచ్చిబాబు చిత్రానికి దర్శకుడు. కాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కీ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్కికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే భారీ విజయం సాధిస్తారని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో పాటను ఒక్కో స్టార్ హీరో విడుదల చేయడం గమనార్హం. చిత్ర ట్రైలర్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే భారీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రానికే ఇంత క్రేజ్ రావడం చూసి భవిష్యత్ లో పెద్ద స్టార్స్ జాబితాలో చేరతాడనే ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.