కరోనా తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 2020-21 వార్షిక బడ్జెట్ రూపొందించామని కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంతో కష్టాల్లో ఉన్నవారిపై ఎలాంటి భారం పడకుండా.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకెళ్తూమాని అన్నారు. అనంతరం లఘు ఉద్యోగ భారతి సంస్థ నిర్వహించిన పారిశ్రామిక వేత్తలు, మేధావులతో చర్చా గోష్టిలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సూచన మేరకే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ , నీతి ఆయోగ్ సూచన మేరకే , కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీల విషయంలో నీతి ఆయోగ్ సూచనల మేరకే పెట్టుబడులు ఉపసంహరణ ఉంటుందని.. అన్ని ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రేవేటికరించే నిర్ణయం కేంద్రం తీసుకోదని అన్నారు. ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కొలుకుంటుందని, జీఎస్టీ ఆదాయం పెరుగుతుందని ఠాకూర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమానికి తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ , కిసాన్ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు.