బక్రీద్ త్యాగానికి ప్రతీక: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
బక్రీద్ పర్వదినం సందర్భంగా నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి.. ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ అని అన్నారు. ఆదివారం పట్టణంలోని ఈద్గ సందర్శించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెప్తుందన్నారు ఎమ్మెల్యే .జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని మానవాళికి ఇస్తుందని…