మోస్ట్ క్రేజీఎస్ట్ స్థానంగా ముషీరాబాద్ ..టికెట్ కోసం నేతల క్యూ..
జీహెచ్ఎంసీ పరిధిలోని ముషీరాబాద్ నియోజకవర్గం మోస్ట్ క్రేజీఎస్ట్ స్థానంగా మారింది. ఇక్కడ పోటిచేయాలని ప్రధాన పార్టీల నేతలు.. సీనియర్ నేతల కుమారులు.. పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటు అధికార పార్టీ నుంచి మరోసారి పోటిచేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పట్టుదలతో కనిపిస్తుంటే.. అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు.ఈరెండు పార్టీలకంటే బీజేపీలో ఆశావాహులు అధిక సంఖ్యలో ఉండటంతో ఈసీటు కాకరేపుతోంది. ముషీరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముఠాగోపాల్ కొనసాగుతున్నారు. మరోసారి…