National: బంగ్లాదేశ్‌లో జిన్నా వర్సెస్ ముజీబ్.. తెరపైకి 1971 జ్ఞాపకాలు!
National: బంగ్లాదేశ్‌లో చరిత్ర మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా వారసత్వాన్ని ప్రస్తావించే ఘటనలు ఒకవైపు కనిపిస్తుండగా.. మరోవైపు 1971 విమోచన పోరాటం, బెంగాలీ జాతీయవాదం, షేక్ ముజీబ్ పాత్రపై చర్చ మళ్లీ వేడెక్కుతోంది. ఢాకా యూనివర్సిటీ ఆర్కైవ్‌లో ఉన్న జిన్నా ఫొటోను ఓ విద్యార్థి చించివేసిన ఘటన ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. 1971 విమోచన పోరాటాన్ని, భాషా ఉద్యమ చరిత్రను విస్మరించలేమన్న అభిప్రాయాలు ఈ ఘటన…
