రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయ డేటాకే భద్రత లేదు: నాదెండ్ల మనోహర్
Janasena: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేస్తే దిక్కులేదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న డేటాకే రక్షణ లేకపోతే, సామాన్యుడి కుటుంబాల డేటాకి భద్రత ఎక్కడ ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ప్రజల డేటా చోరీ చేస్తోందన్నారు. ప్రజల వివరాలు తెలుసుకుని హైదరాబాద్ లో ఉన్న ఓ సంస్థకు ఇచ్చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి రోడ్డు వేయాలో కూడా ఆ సంస్థే…