తిరుమల తిరుపతి పవిత్రతను జనసేన కాపాడుతుంది: నాగబాబు
Janasena:వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో అక్రమంగా దోచుకున్నదంతా జనసేన ప్రభుత్వంలో కక్కిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు. వైసీపీ నాయకుల ధన దాహానికి అపవిత్రమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాలను జనసేన పాలనలో సరిదిద్దుతామని వెల్లడించారు. స్వార్థపరమైన జీ.ఓ.లు, ఏకపక్ష నిర్ణయాలపై పునః పరిశీలన చేపడతామని అన్నారు. తిరుపతి నియోజకవర్గం జనసేన కార్యవర్గంతో బుధవారం జరిగిన “వర్చువల్” సమావేశంలో నాగబాబు మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల…