Balagopal: స్మరిస్తేనే రోమాలు నిక్కపొడుస్తాయ్.. కారణజన్ముడికి నివాళి..!
ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఎవరితోనూ పోల్చలేని వ్యక్తి బాలగోపాల్. నలుగురికి ఉపయోగపడే పనికి ప్రతిరూపం ఆయన.సమస్యను సమ్యక్ దృష్టితో చూడ్టం, అర్థంచేసుకోపడం, అందరికీ అవగాహన కలిగించడం, సమాధానాలు-పరిష్కారాల కోసం ఉద్యమీకరించడం… ఇలా తాను ఆచరిస్తూ, ఉదాత్త నేతృత్వంతో హక్కులకై పోరాడే ఒక తరాన్నే తయారుచేసిన కర్మయోగి! ఆయన ఆలోచనల బలం, తాత్విక దృష్టి విశాలత్వం, ఆచరణలోని నిబద్దత… ఎందరెందరినో ప్రభావితం చేసి, అభిమానులుగా, హక్కుల కార్యకర్తలుగా జేసింది. అణచివేత, నిర్బంధం, పీడన, హక్కుల…