ప్రజామోదం పొందిన ప్రగతిశీల బడ్జెట్_ మోదీ
2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉపాధి, గృహనిర్మాణం, విద్య తదితర అంశాలకు సంబంధించి పలు భారీ ప్రకటనలు చేశారు ఆర్థికమంత్రి. దేశ సమగ్ర అభివృద్ధికి బడ్జెట్ లోని అంశాలు ఉపకరిస్తాయని పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పడుతుందని కొనియాడారు. పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు…