కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే తరుణంలో సంస్కరణలే ఎజెండాగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుంది. బహుశా అనేక సవాళ్ళతో కూడిన బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. బడ్జెట్ 2020_21 కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మొదటగా వివిధ రంగాల వృద్ధి, కేటాయింపుల అంశంతో పాటు,రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే సంస్కరణల గురించి వెల్లడిస్తారు. ఆదాయపు పన్నుకు సంబందిచి నిర్దిష్ట మార్పులు, మినహాయింపు, పరిమితులు, గురించి వెల్లడించనున్నారు. ఇక వస్తు సేవల పన్నుల (జీఎస్టి) రేట్లలో మార్పులను కేంద్ర మంత్రి బడ్జెట్లో ప్రవేశపెట్టే ఆస్కారముంది.
కాగా దిగుమతి వస్తువులపై సుంకాలు, ప్రధానంగా పెట్రోల్, డీజిల్ పన్ను పెంపుతో మార్పుల అంశంపై ప్రకటించే అవకాశం ఉంది.
గత బడ్జెట్లలో నామమాత్రపు జీడీపీ 11 శాతంగా అంచనా వేయబడేది. అయితే 2019లో కేవలం 7 శాతంగా ఉంది. ప్రస్తుతం కోవిడ్ సంక్షోభం దృష్ట్యా ప్రతికూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.