2021 ఐపీఎల్ భారత్ లోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమాల్ స్పష్టం చేశాడు. గత ఐపీఎల్ సీజన్ కరోనా నేపథ్యంలో దుబాయ్ నిర్వహిండం.. ప్రత్యామ్నాయ వేదిక గురించి వస్తున్న వార్తలకు ధూమాల్ చెక్ పెట్టాడు. లీగ్ ఇక్కడ జరగాలన్నదే మా ఆకాంక్ష , ప్రస్తుతం యూఏఈ కంటే భారత్ సురక్షితం అని తెలిపారు. ఐపీఎల్ జరిగే టైంకి అందులో పాల్గొనే ఆటగాళ్ల అందరికీ కోవిడ్ టీకాలు వేయించేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించాడు.
కాగా కరోనా ముప్పు నేపథ్యంలో ప్రవేశపెట్టిన బయో బబుల్ విధానం గురించి మాట్లాడుతూ.. ఆ విధంగా ఆటగాళ్ళు మ్యాచ్లు ఆడడం చాలా కష్టంకానీ , అలా మ్యాచ్లు జరగడం మంచిదేనని అన్నారు. గత ఐపీఎల్ సీజన్లో అభిమానులకు డైరెక్ట్ గా ఐపీఎల్ చూసే భాగ్యం దక్కలేదు. కానీ ప్రస్తుత సీజన్లో ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానులను అనుమతించే అవకాశమున్నట్లు ధూమాల్ సూచన ప్రాయంగా తెలియజేసాడు.