ఏపీ రాజకీయాల్లో మార్పు కోసం పవన్ యాత్ర: నాదెండ్ల మనోహర్
Janasenavarahi: ఏపీ రాజకీయాల్లో మార్పు కోసం… ఓ నూతన అధ్యాయం నిర్మాణం కోసం… ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన నుంచి ప్రారంభించబోతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ‘‘సకల శుభాలనిచ్చే అన్నవరం సత్యదేవుడి దర్శనం…