పెగాసస్ పై స్పష్టత ఇచ్చినా కేంద్రం!
పార్లమెంటును కుదిపేస్తున్న పెగసస్ వ్యవహారంపై కేంద్రం మౌనం వీడింది. పెగసస్ వ్యవహారంపై ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో.. ఈ స్పైవేర్ తయారీ సంస్థ, ఎన్ఎస్ఓ గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు లేవని రాజ్యసభలో స్పష్టం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రధాని మోదీ సైతం ఆవేదన వ్యక్తం చేసిన రెండు రోజుల్లోనే.. కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక పెగసస్ వ్యవహారంపై సీపీఎం ఎంపీ వి.శివదాసన్ రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తూ..ఎన్ఎస్వో గ్రూప్…