Telangana:బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కవిత ఢిల్లీ పర్యటన?
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు రెండు…