ప్రస్తుతం లాక్ డౌన్ అవసరం లేదు : శక్తి కాంతా దాస్
దేశంలో కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్ చీఫ్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. గురువారం టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాలన్నారు. రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమే అయినప్పటికీ ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండటాన్ని గుర్తు చేశారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ…