చీకటి జీవోను రద్దు చేయండి: ఎంపీ రఘురామ
రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) బి కి పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. 1972లో ముంబై పోలీస్ కమిషనర్ ఇటువంటి జీవో జారీ చేయగా.. హిమ్మత్ లాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే జీవోను కొట్టివేసిందని గుర్తు చేశారు. సాధారణంగా ఇటువంటి జీవోలు పోలీసులు…