వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన భారత యువ ఆటగాడు..
వన్డే క్రికెట్ చరిత్రలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 1000 పరుగలు సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ రికార్డులోకెక్కాడు. వెస్టిండీస్ తో తొలి వన్డేల్లో 54 పరుగులు చేసిన శ్రేయస్ ఈమైలురాయిని అధిగమించాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ అతని కంటే ముందు వరుసలో ఉన్నారు. వన్డేల్లోకి 2017 లో అరంగ్రేటం చేసిన శ్రేయస్ 25 ఇన్నింగ్స్ లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు….