‘నల్లసూరీళ్ల’’ కు అండగా కాంగ్రెస్ : CLP మల్లు బట్టివిక్రమార్క
తెలంగాణ రాష్ట్రానికి మణిహారమైన సింగరేణి ఎన్నో ఏండ్లుగా దేశానికి పెద్దఎత్తున నల్ల బంగారాన్ని అందిస్తూ ప్రధాన ఇంధన వనరుగా తోడ్పడుతోంది. హైదరాబాద్ (డెక్కన్) కంపెనీగా పిలువబడుతూ 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి, 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్‌గా రూపాంతరం చెందింది. 133 సంవత్సరాలుగా నిరాటంకంగా రాష్ట్రానికి సిరుల మణిగా కొనసాగుతూ రారాజుగా వెలుగొంది లక్షలాది కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్న సింగరేణి కాలరీస్ తెలంగాణ ప్రజల సొంత ఆస్తి. తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం…