మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. కేసీఆర్ పై కాషాయనేతలు ఫైర్ ..
మునుగోడులో బీజేపీ దూకుడు పెంచింది. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు కాషాయంనేతలు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారంటూ కాషాయం నేతలు పదునైన మాటల తూటాలతో రెచ్చిపోయారు. కాగా ఉప ఎన్నికలో దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చేయాలని సవాల్…