మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. కేసీఆర్ పై కాషాయనేతలు ఫైర్ ..

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. కేసీఆర్ పై కాషాయనేతలు ఫైర్ ..

మునుగోడులో బీజేపీ దూకుడు పెంచింది. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు కాషాయంనేతలు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారంటూ కాషాయం నేతలు పదునైన మాటల తూటాలతో రెచ్చిపోయారు.

కాగా ఉప ఎన్నికలో దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .కేసీఆర్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తేల్చిచెప్పారు.బీజేపీ మునుగోడులో లేదనేది ఒకప్పటి మాటని.. ఉప ఎన్నికలో బీజేపీ గెలిచితీరుందని ఘంటాపథంగా చెప్పారు. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని.. ఆత్మబలిదానాలతోనే రాష్ట్రం సిద్ధించిందని రాజగోపాల్ స్పష్టం చేశారు . ఉద్యమంలో ఏనాడు కనపడని వ్యక్తులు ఇవాళ అధికారాన్ని అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ లాంటి గొప్ప వ్యక్తులను పక్కన పెట్టినప్పుడే కేసీఆర్ పతనం మొదలైందని తేల్చిచెప్పారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని రాజగోపాల్ కుండబద్ధలు కొట్టారు.

వ్యక్తిగత స్వార్ధం కోసం తాను పార్టీ మరోమారు కుండబద్ధలు కొట్టారు రాజగోపాల్. తన మీద కక్షతోనే నియోజకవర్గానికి నిధులు రాకుండా కేసీఆర్ అడ్డుపడ్డాడని ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు.కాంగ్రెస్ అంటే గౌరవమని..పార్టీ చిల్లర దొంగ చేతుల్లోకి వెళ్ళిందని మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా వల్లే దేశం సురక్షితంగా ఉందన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రాజగోపాల్ పేర్కొన్నారు.

అటు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ బన్సల్ . రాష్ట్రంలో దోపిడి ఏవిధంగా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు బన్సల్. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని ఆరోపించారు.ఉప ఎన్నిక ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని తేల్చిచెప్పారు. రాష్ట్ర సాధన లక్ష్యం వేరని..ఇప్పుడు జరుగుతుందని వేరని.. కేసీఆర్ పాలన నియంతను తలపిస్తోందని మండిపడ్డారు. హుజురాబాద్ తరహాలో ..మునుగోడు ప్రజలు ధర్మం వెంట నిలస్తురాని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రం అప్పుల కుప్ప నుంచి బయటపడాలంటే.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని బన్సల్ స్పష్టం చేశారు.

మొత్తంమీద మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే  లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కాషాయం నేతలు. ధర్మయుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని.. కార్యచరణపై దృష్టిసారించనున్నారు.