Telangana: సర్వేయర్లు లేరు భూదార్ కార్డు ఎలా?
వి.బాలరాజు (తహశీల్దారు రిటైర్డు): భూములను సర్వే చేసి నవీకరణ చేస్తామని గత ప్రభుత్వం తెలిపింది.డిజిటల్ మ్యాప్ అఫ్ తెలంగాణ చేస్తామని ప్రకటించింది.కానీ, సర్వేపనిని పూర్తిగా విస్మరించింది. భూములతో ముడిపడి ఉన్న అవినీతి తగ్గాలంటే రికార్డుకు భూమికి లింకు ఉండాలని రెవిన్యూ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, న్యాయస్థానాలు, ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో అదేపనిగా చెబుతున్నారు. వాస్తవానికి జాతీయ భూముల నవీకరణ పథకం (ఎం.ఎల్.ఆర్.ఎం.పి) క్రింద సమగ్ర సర్వేకు 2014లోనే నిధులు…