Saibaba: ఒక వీరునికి కడసారి వీడ్కోలు..!

తాడి ప్రకాష్: 2024 అక్టోబర్ 14,హైదరాబాద్, మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్ మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవి ఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొడవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద… రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషిని చివరిసారి చూడడం…

Read More

ARTISTMOHAN:నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…!

Taadi Prakash: (సెప్టెంబర్ 21 మోహన్ ఏడవ వర్ధంతి) హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుక్కున్నా చికాకు పడినా.. రచయితలు, ఆర్డిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదేపదే చెబుతుంటాడు. మోహన్ అలాగే…

Read More
Optimized by Optimole