ఏపీలో ఎమ్మెల్సీ సీటు కోసం జర్నలిస్టుల కుస్తీ..?
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోటిచేసే అభ్యర్థులతో పాటు ఆశావాహుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. గవర్నర్ కోటా లేదా శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా.. తమకు అవకాశం కల్పించాలని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన తెలుగు చానళ్లలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వీరేకాక రిటైరైన జర్నలిస్టులు.. జగన్ సొంత మీడియాలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి వ్యక్తి, ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న పేరున్న జర్నలిస్ట్ సైతం టికెట్ కోసం…